పరిశోధనలు ఎప్పుడు సహాజమైన ఉత్పత్తులకే పెద్దపీట వేస్తాయి. వర్కవుట్స్ చేసే వారు కండలు పెంచేవారు ,శక్తి కోసం వాడే ప్రోటీన్ పౌడర్లు ,సహాజ పదార్థాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చాలా పౌడర్లలో హాని కారకమైన భారలోహాలు ఉంటాయని ,వాటిని అలాగే వాడితే మంచి చేయకపోగ దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు . ఈ ప్రోటీన్ పౌడర్స్ లో భారలోహాలతో పాటు 130 రకాల రసాయనాలు కూడా ఉంటాయన్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు . ఈ పౌడర్ల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారు.

Leave a comment