నీహారికా ,

లైఫ్ కూల్ గా సక్సెస్ ఫుల్ గా పదిమందిలో గుర్తింపు ఉండేలా సాగితే బావుంటుంది అన్నావు. అంటే వ్యక్తిగత పరిపూర్ణత కావాలి. సామజిక గౌరవమూ  దక్కాలి. ఇవి రెండు కావాలంటే మనలోని శక్తినీ నైపుణ్యాన్ని గుర్తించి వాటిని సరైన తీరులో ధోరణిలో ఉపయోగించుకోగలగాలి. జీవితం సక్సెస్ ఫుల్ గా సాగాలంటే ఐపోతుందా. వ్యక్తిగత పరిపూర్ణత కు విజయం ఆరోగ్యం ప్రధాన పఠనాలు. వీటితో సంతోషం సంపదా  రెండు దక్కుతాయి. చాలా మంది దృష్టి లో విజయం అంటే పొజిషన్ పవర్ దానం. కానీ వీటన్నింటినీ  మించి మనకు మన పట్ల ఇతరుల పట్ల ఆరోగ్య సంబంధమైన సంబంధ భాంధవ్యాలు కలిగి ఉండటం శారీరికమైన భావోద్వేగ పూరితమైన ఆరోగ్యం కూడా అవసరం. హోదా ఆస్తులు విజయానికి అర్ధం అంటే సరిపోదు. ఇంకా ఎన్నెన్నో వున్నాయి. మానవ సంబంధాలు మనుషుల పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఇతరులను మన వైపు నుంచి చూడటం కాకుండా వాళ్ళ స్థానంలో నిలబడి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక అంచనా కు రావటం ఇవీ ముఖ్యం. ఇదెంత కష్టమో అంత తేలిక. ఒకళ్లనుంచి తేలికగా ఒక నిర్ధారణ కు వస్తాం. కానీ వాళ్ళు మన స్థానంలో ఉంటే మన గురించి ఎలా ఆలోచించగలరు ? అని చుస్తే మనకు సరైన దృక్పధం ఉన్నట్లు. ఇదే వ్యక్తిగత పరిపూర్ణత అంటే. మనల్ని ప్రపంచం వీళ్ళు అన్ని అంచనాలకు నిలబడేవాళ్లు అని గుర్తిస్తుంది. ఇదీ విజయవంత మైన జీవితం అంటే . కొంచెం ఆలోచించు.

Leave a comment