ఎలా వాడగాలమో తెలియదు కానీ అన్నీ మంచివే అంటారు కమలా పండు వలుచ్చుకుని తొక్క పారేస్తాం కానీ కమలా, ద్రాక్ష పై తొక్కలో వుండే లియోనేక్ అనే పదార్ధం  కాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందిట. బాగా కడిగినా కమలా పండు పై తొక్కను సూప్ లు, బేకింగ్ పదార్ధాలు, పెరుగు  లేదా వేడి టీ లో కలుపు కొంటే ఎంతో ప్రయోజనం అంటున్నారు. అలాగే కమలా తొక్క కింద వుండే తెల్లని పోరా  ఎలెబెడో లో కరిగిపోగల పీచు పెక్టిన్ ఉందిట. ఇది కొలెస్టరాళ్ ను తగ్గిస్తుంది. అంటే కమలా వంటి సిట్రస్ పండులో వృధాగా పారేయగల పదార్ధం ఏదీ లేదు. శరీరానికి విటమిన్ సి కావాలి. కానీ స్టాక్ చేసుకోలేదు కనుక ప్రతి రోజు కమలా జ్యూస్ తాగితే మంచిదే అంటున్నారు.

Leave a comment