వాకింగ్ కంటే జాగింగ్ . అంతకంటే స్పీడ్ వాకింగ్ మంచిదంటారు, క్యాలరీలు సంతృప్తికరమైన స్థాయిలో ఖర్చు చేయాలంటే కనీసం గంటకు 7.2 కిలోమీటర్లు నడవగలగాలి అంటే నడకలో అంతవేగం ఉండాలి . ఎంత స్పీడ్ వాక్ చేస్తే అన్ని క్యాలరీలు ఖర్చువుతాయి . నడక కొవ్వుని కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా ఉండాలి . చిన్న చిన్న అడుగులు తక్కువ అలసట ఇస్తాయి . సరైన పోశ్చర్ అవసరం చుబుకం పైకెత్తి తిన్నగా మందుకు చూస్తూ నడవాలి . ముంజేతులను ముందుకు వెనుక్కు బాగా కదిలిస్తూ నడవాలి . పై బాగం శక్తి పెరుగుతుంది వెళ్ళవాపులు రావు . ఉదార కండరాలు సరైన పొజిషన్ లో ఉంటాయి . వేగం మధ్యలో ఇంటర్ వెల్స్ తీసుకొంటే అలసట రావు . ఇది ఫిట్ నెస్ కు చక్కగా ఉపయోగపడే టెక్నీక్ జాగింగ్ కంటే వేగంగా శరీరంలో కొవ్వు కరిగిపోతుంది

Leave a comment