లక్ష్మీబాయి ఆఫ్ జర్నలిజం అంటున్నారు ప్రజ్ఞ మిశ్రా.కటింగ్ చాయ్ పేరుతో సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు చేసేది ప్రజ్ఞ  ‘ఉల్టా ఛష్మా యూసి’ పేరుతో ఒక వెబ్ సైట్ నడుపుతోంది హత్రాస్ లోని బుల్గాడీ కి  చెందిన యువతి పై జరిగిన అత్యాచారం అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా చేసిన అంత్యక్రియల్ని చూస్తూ ఇలా అత్యవసరంగా ఎందుకు ఆమెకు అంతిమ సంస్కారాన్ని చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు పోలీసులు కంగారు పడ్డారు.ఎంతో కష్టపడి బాధిత కుటుంబాన్నికలుసుకొంది ప్రజ్ఞ. మృతురాలి సోదరిని ఇంటర్వ్యూ చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది ఇంత కష్టపడింది కనుకనే ఆమెకు ఎంతో మంది ఆడపిల్లలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Leave a comment