బాలీవుడ్ నటుల్లా గా ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్న నేషనల్ యూట్యూబర్ ప్రజాక్త కోలీ ‘Mostly same’పేరుతో ఈమె షేర్ చేసే వీడియోలకు 50 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు మాస్ మీడియా లో డిగ్రీ పూర్తి చేసి ముంబై లో ఫీవర్ 104 ఎఫ్.ఎం ఆర్జీ గా కెరియర్ మొదలుపెట్టిన ప్రజాక్త కోలీ సామాజిక సమస్యలపై కూడా వీడియోలు చేసింది.యూట్యూబ్ ప్రారంభించిన క్రియేటర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి భారతదేశం తరఫున రెండుసార్లు ఎంపికైన ఏకైక డిజిటల్ క్రియేటర్ ప్రజాక్త..బోనీ కపూర్ కూతురు అన్షులా ప్రారంభించిన ‘ఫ్యాన్ కైండ్’ సంస్థ తో కలిసి మానసిక సమస్యలపై పోరాడుతోంది ప్రజాక్త కోలీ .ఫోర్బ్స్ 30,అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకుంది ప్రజాక్త.