నీహారికా ,

ఈ రోజు నీకో మంచి విషయం చెప్తాను. ఈ ప్రకృతి  మనకెలాంటి పాఠాలు చెపుతుందో చూడు. ప్రపంచంలో రెండు సముద్రాలున్నాయి. డెడ్ సి , సీ ఆఫ్ గెలీలీ. ఇవి పెద్ద సరస్సులు . ఈ రెంటిలోకి జోర్దాన్ నదీ జలాలు వస్తాయి. డెడ్ సీ సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటుంది. దాని నుంచి నీరు బయటకి పోదు. ఆనీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఏ ప్రాణీ బతకదు. సీ ఆఫ్ గెలీలీ లోకి నీరు వస్తుంది . బయటకు ప్రవహిస్తుంది. ఇందులో ఎన్నో రకాల చేపలూ ఎన్నో ప్రాణులూ ఉన్నాయి. జ్ఞానం సంపద ప్రేమ గౌరవం మరెన్నో జీవితంలో పొందినంత  మాత్రాన అది జీవించటం కాదు. మనం  జీవితంలో పొందినవి ఇతరులతో పంచుకోవటం లోనే అసలైన జీవితముంది. డెడ్ సీ లాగా  ప్రవహించకుండా ఉంటే జీవం లేకుండా వున్నట్లే. సగటు మనిషి తన ఆనందాన్ని సంపద ఆరోగ్యం పదవి సంతానం లో వెతుక్కుంటాడు నిజమే. తనకున్న సంపదను చూసి  సంతోషించేవారు లేకపోతే పంచుకునేవారు లేకపోతే జీవితం ఎడారి లాగా ఉండదూ ? అందుకే చుట్టూ పచ్చగా ఉండాలి. ప్రకృతి లాగా ఏ స్వార్ధమూ లేకుండా మనకున్నదేదో ఇవ్వగలిగితే మనకున్న జ్ఞానం ఇతరులకుపంచగలిగితే అదే ఆనంద ప్రవాహాలకు దారి తెరుస్తుంది. లేదా డెడ్ సీ లాగా జీవ లక్షణం లేకుండా మృత ప్రాయంగా అయిపోతుంది. నువ్వు అర్ధం చేసుకున్నావనుకుంటాను. నీహారికా ఇవ్వటంలో ఆనందం వుంది వెతుకు మరీ !!

 

Leave a comment