పిల్లలకు ఏది ఇష్టమో, ఏవి నచ్చుతాయో పెద్దలకు బాగా తెలుసు తల్లిదండ్రులు పిల్లలకోసం దేన్నయినా తెచ్చి ఇచ్చేందుకు ఇష్టపడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కంప్యూటర్, మంచి టాయ్స్, భోజనం ఏదైనా వాళ్ళకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ తెలివి తేటలు పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది గ్రీనరీ అంటున్నారు పరిశోధకులు. వాళ్ళు పచ్చని ప్రకృతి లో కలిసి కాలం గడిపే వీలుంటే వాళ్ళలో తెలివితేటలు, విద్యలో పురోగతులు వుంటుంది అంటున్నారు. ఏడు నుంచి పదేళ్ళ పిల్లలకు ప్రకృతిలో పరిచయం చేయండి, ఆరు బయట ఎండలో, వర్షంలో ప్రకృతి వడిలో ఆడనివ్వండి. వాళ్ళలో కలిగే మానసిక ఆనందంలో వాళ్ళ ఐక్యు పెరుగుతుంది. చక్కగా చదువు కలుగుతారు అంటున్నారు పరిశోధకులు. పిల్లల పై పచ్చదనం ప్రభావం ఎంతగానో ఉంటుందంటున్నారు.

Leave a comment