ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా ఇంటి పట్టునే . వాళ్ళ బద్రత చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా మెట్లవైపే వెళతారు. అక్కడే సేఫ్టీ గుర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల పైన ఆడకుండా , దుకకుండా చూడాలి. బల్కనీ ఎత్తు తక్కువగానే వుంటుంది. పిల్లలు కుర్చీలు ఈడ్చుకు పోయి, వాటి పైన ఎక్కి తొంగి చూస్తారు. రెయిలింగ్ కు కాళ్ళు పెట్టి ఎక్కేసి తొంగి చూస్తారు. అక్కడే కాపలా కాయాలి. టైల్స్ మార్బల్స్ పైన వాళ్ళే వాళ్ళే నీళ్ళు వలకస్తారు, జారి పడిపోతారు. ఇంట్లో వాష్ రూమ్ లో నీళ్ళు పడకుండా చూడాలి. ఓవెన్స్, హీటర్స్, చపాతి మేకర్స్, ఎలెక్ట్రిక్ కుక్కర్స్, ఇస్త్రీ పెట్టెలు ఏవీ పిల్లలకు అందకుండా సర్దుకోవాలి. కెమికల్స్, హానికరమైన క్లీనింగ్ లిక్విడ్స్ వాళ్ళకు అందనీయవద్దు. ఎదో కూల్ డ్రింక్ అనుకుని తాగేస్తే … ఇలా వరస బట్టి ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం వుండదు. అవన్నీ ద్రుష్టిలో వుంచుకోవాలి.

Leave a comment