Categories

బాను ముష్తాక్ బుకర్ ప్రైజ్ అందుకొన్న తొలి ప్రాంతీయ భాషా రచయితిగా రెండో భారతీయురాలిగా నిలిస్తే అదే రచనలో అనువాదకురాలిగా దీపా భస్తీ తొలి భారతీయ అనువాదకురాలిగా నిలిచారు వారిద్దరూ సృష్టించిన హార్ట్ లాంప్ వారి హృదయ స్పందన అని చెప్పుకోవచ్చు బాను ముష్తాక్ తన కమ్యూనిటీ లోని స్త్రీల సమస్యలు చిన్న కథలుగా రాశారు అంతే సున్నితంగా సహజంగా దాన్ని అనువాదం చేశారు దీప. దీప సొంత ఊరు కర్ణాటక లోని కొడగు జిల్లా పాఠకులను ఉత్తేజపరిచే ఈ హార్ట్ లాంప్ కన్నడ సాహిత్యంలో గొప్ప అచీవ్మెంట్ మాత్రమే కాదు ప్రపంచ పాఠకులకే గొప్ప కానుక.