ప్రపంచంలో తొలి మహిళా రివర్ పైలెట్ రేష్మ నీలోఫర్ ప్రపంచంలోని పలు నౌకాశ్రయాలకు నౌకలు వెళుతూ ఉంటాయి. ఆ నౌకల పైలెట్ లకు స్థానిక రేవు లోనీ మార్గం, ఇతర సమస్యలు తెలియవు. అందుకని ఆ నౌకలకు స్థానికంగా శిక్షణ పొందిన రివర్ పైలెట్స్  ఉంటారు. చెన్నైకు చెందిన రేష్మ నీలోఫర్ ఇప్పుడు కలకత్తా రేవులో రివర్ పైలెట్ గా పనిచేస్తున్నారు. ఆమె నీలోఫర్ అకాడమీ ఆఫ్ మెరి టైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో శిక్షణ తీసుకున్నారు. మెరైన్ టెక్నాలజీ లో ప్రొఫెషనల్ కోర్సు తరువాత ప్రపంచ సముద్రాల మీద నౌకల్లో ఎన్నో తీరాలకు వెళ్లి వచ్చారు. షిప్ తీరం చేరేందుకు ఆ షిప్ ఎక్కి పైలెట్ బాధ్యత తీసుకునేందుకు ఎంతో శారీరక దారుఢ్యం కావాలి .అల్లకల్లోల అలల స్థితి అర్థం చేసుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న రేష్మ నీలోఫర్ నారీ శక్తి పురస్కారం తో ప్రభుత్వం సత్కరించింది.

Leave a comment