వరల్డ్ ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న ఇండియన్ క్వీన్స్ ఫోటో ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తిగా ఉంది చరిత్ర కారుడు మైఖేల్ బెన్నెట్ రాసిన చరిత్ర ఆధారంగా ఈ ఫోటో గురించి వివరణ దొరికింది ఈ చిత్రం రెండు వందల సంవత్సరాల నాటిది.కుడివైపున ఉన్న ఆమె రాణీ దేవ జమ్మ మైసూర్ రాజు మూడవ కృష్ణరాజు ఉడయార్ భార్య మధ్యలో ఉన్నది కృష్ణరాజు ఉడయార్ నాయనమ్మ లక్ష్మి అమ్మాని చిత్రంలో ఆమె చీరె కొంగు పైకి పట్టుకొని ఉన్నది. భారత్ లోనే ఈస్ట్ ఇండియా పాలన సాగుతున్న ఆ రోజుల్లో స్మాల్ పాక్స్ వేలాది మందిని పొట్టన పెట్టుకుంది కానీ ప్రజలకు ధైర్యం చాలలేదు అప్పుడు దేవ జమ్మ ముందుకు వచ్చి టీకాలు వేయించుకున్నది. ఎందరిలోనో ధైర్యం నింపిన ఈ సంఘటనని ఒక చిత్రపటం గా మలిచారు ఆ నాటి స్త్రీల స్ఫూర్తితో ఇప్పుడూ కూడా కోవిడ్ టీకా అందరు వేయించుకోవాలనే ఉదేశ్యం తో ఈ ఫోటో నీ మధ్య మల్లోకి తెచ్చారు అరుదైన ఫోటో ఇది.

Leave a comment