గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు  తేలికగా అవుతోందని ఎప్పుడో  పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామం తో ప్రసవ నొప్పులు సమయం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి 500 మంది పై చేసిన ఓ అధ్యయనంలో ప్రసవించేప్పుడు నొప్పులు పడే సమయం. తల్లి బరువు బిడ్డ బరువు కాన్పు జరిగిన తీరు మొదలైన విషయాలు పరిశీలించారు. వ్యాయామం చేసిన మహిళల్లో కాన్పు తర్వాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా యధాస్థితికి చాలా త్వరగా వచ్చినట్లు గుర్తించారు.ప్రసవ వేదన తగ్గించుకోవటం కోసం తప్పనిసరిగా వ్యాయామం చేయండి అంటున్నారు వైద్యులు.

Leave a comment