నీహారికా, పిల్లలు ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు అనుకుంటాం కానీ అసలు ప్రషణలు వేసే అలవాటు, తెలుసుకోవాలనే కుతూహలం వాళ్ళని సరైన వ్యక్తులుగా, తీర్చి దిద్దుతాయంటారు ఎక్స్ పర్ట్స్  ప్రశ్నలు వేస్తె సంతోషించాలి. ఆ ప్రషణలు వాళ్ళకి వస్తున్నాయంటే వాళ్ళు మానసికంగా వికసిస్తున్నారు అని అర్ధం. ఎన్ని కొత్త ప్రశ్నలు వాళ్ళు వేస్తె వాళ్ళకి అన్ని కొత్త విషయాల పట్ల ఆసక్తి  వుందని తెలుసుకోవాలి. అందుకే  ప్రశ్నలను ఎప్పుడు  తిరస్కరించ వద్దు. ఆ ప్రశ్నల వెనక వున్న ఉత్సాహం గమనించి ప్రోత్సహించాలి. ఒక వేళ సమాధానం తెలియక పొతే ఇంకొంత మందిని అడిగి తెలుసుకుని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మహా వికాసాన్ని చూసి సంతోషించాలి. ప్రషణలు లేనివే మానవ నాగరికత లేదు. ప్రశ్నిస్తేనే జీవితం. ప్రశానలతో విసిగిస్తుందని కోపడకూడదు. అన్ని ప్రషణలు వేసే శక్తి వాళ్ళలో వుందని పొంగి పోవాలి.

Leave a comment