Categories
పెళ్ళై పోతుంది కదా ఇక హీరోయిన్ ఛాన్స్ లు వస్తాయా ? రావా? అని మీడియా ప్రశ్నలు సంధిస్తే సోనమ్ కపూర్ అలాంటి అనుమానాలు వద్దంటోంది. పెళ్ళైతే అవకాశాలు తగ్గిపోతాయి అనుకోవటం చాల పొరపాటు. శ్రీదేవి ,మాధురీ దీక్షీత్ ,కాజోల్ ,కరీనా కపూర్ వీళ్ళందరు పెళ్ళిళ్ళు అయ్యాక బోలేడన్నీ సినిమాలు చేశారు,చేస్తున్నారు. ఇది ఒక ఇండస్ట్రీ ప్రతిభ ,కష్టపడే తత్వం ఉంటే చాలు మనం తప్పితే ఆ పాత్రలు ఇంకెవరు చేయలేరు అనే నమ్మకం ఇవ్వగలిగితే చాలు అవకాశాలు ఎక్కడికి పోతాయి. ఇవి ఉద్యోగాల లాంటివి అంటోంది సోనమ్ కపూర్.