నీహారికా,
మన జీవిటంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని, ప్రతి రోజునూ ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నా విషయాన్ని బట్టి మన జీవితం రూపం పోసుకుంటుంది. సమయం వృధా చేసుకోవడం అంటే మనల్ని మనం పోగొట్టు కోవడమే. నిజమే కదా గడిచిపోయిన ఒక్క నిమిషం కుడా వెనక్కి తిరిగి తీసుకు రాలేక పోతాం. మనం ప్రతి విషయాన్ని బడ్జెట్ వేసుకుని, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కుడా అంట పొదుపుగా కక్యాల్కులేటెడ్ గా వుండాలి సుమా. అంటే మన కాలాన్ని కుడా లెక్కలు వేసి అచ్చం బడ్జెట్ గా ముందే రేపు ఉదయాన్నే ఈ పని తో మొదలు పెడతాం అని డైరీ రాసుకున్నట్లే మొదలు పెట్టాలి. ఇది కేవలం బిజినెస్ మాగ్నెట్లే చేయవలసిన పని కాదు. ప్రపంచంలో ప్రతి మనిషికీ సమయం విలువ ఒక్కటే మన దగ్గర వున్నా తిరుగులేని సంపద. మనం జీవిస్తూ వున్న కాలం. ఆ సంపదని ఎంత శ్రద్దగా నిమిషా నిమిషం వృధా చేయకుండా కాపాడు కోవాలో కేల్ల్లేసి తేల్చుకోవాలి. సమయం వృధా చేసి గోప్ప్ విజయాలు సాదించిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవ్వళ్ళు లేరు.