నీహారికా ,ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఆనందం లోంచి వచ్చింది . మనం ప్రతి రోజునే ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటాను . అప్పుడు మనలో నెగిటివ్ ధాట్స్ రావు. ఒత్తిడి ఉండదు. రిలాక్స్ గా ఉంటాం. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజునీ పుట్టిన రోజు లాగే భావిస్తే మన పుట్టుక ఎదో సాధించటానికనే ఆలోచన నీలో కలిగితే దానికోసం నువ్వు కష్ట పడేందుకు కదిలితే ఇంకేముంది చెప్పు . కష్టపడేందుకు సిద్ధం అయితే ఏది అసాధ్యం . ఒక వ్యాపారం లాభం సాధించినవారిని ఒక ఐఏఎస్ పాసయినవాడిని అదే ఇదెలా అంటే ఏమంటారు. దానిపైనే దృష్టి పెట్టాం అంటారు. విజయానికి దగ్గర దార్లు ఎప్పుడు వుండవు. రాజ మార్గమే. అలసట అనుకోకుడన నడిచి తీరటమే ! గమ్యం చేరటమే !
Categories
Nemalika

ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం

నీహారికా ,

ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా  అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే  పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఆనందం లోంచి వచ్చింది . మనం ప్రతి రోజునే ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటాను . అప్పుడు మనలో నెగిటివ్ ధాట్స్ రావు. ఒత్తిడి ఉండదు. రిలాక్స్ గా ఉంటాం. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజునీ పుట్టిన రోజు లాగే భావిస్తే మన పుట్టుక ఎదో సాధించటానికనే ఆలోచన నీలో కలిగితే దానికోసం నువ్వు కష్ట పడేందుకు కదిలితే ఇంకేముంది చెప్పు . కష్టపడేందుకు సిద్ధం అయితే ఏది అసాధ్యం . ఒక వ్యాపారం లాభం సాధించినవారిని ఒక ఐఏఎస్ పాసయినవాడిని అదే ఇదెలా అంటే ఏమంటారు. దానిపైనే దృష్టి  పెట్టాం అంటారు. విజయానికి దగ్గర దార్లు ఎప్పుడు వుండవు. రాజ మార్గమే. అలసట అనుకోకుడన నడిచి తీరటమే ! గమ్యం చేరటమే !

Leave a comment