చిన్ని చిన్ని అకేషన్స్,పార్టీలకు కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బావుండు అనుకుంటారు అమ్మాయిలు. పెళ్ళయినవాళ్ళు పెళ్ళికాని అమ్మాయిలు కూడా పరికిణి ఓణి ప్రయత్నించవచ్చు అంటారు డిజైనర్స్. ప్రత్యేకంగా అంటే పట్టు పావడలే బావుంటాయి.వీటి అంచులు,నేత పనితనమే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.ఇకాత్ ,గద్వాల్,నారాయణ పేట రకాలు ఎంచుకోవచ్చు.వీటికి తగ్గ చక్కని ప్యాట్రన్ బ్లౌజులు,అందమైన జరీ ఉంటే చాలు. ఆకాశ నీలం,పీచు,గులాబీ,పసుపు,ఎరుపు వంటి రంగుల పరికిణీలు ఎంచుకుని కాస్త ఆడంబరంగా కనిపించేందుకు బెనారస్,చాందిని,జార్జెట్ దుపట్టాలు వాటి పై కచ్ వర్క్ ,అద్దాలు,కుందన్ లు కుట్టిన ఎంబ్రాయిడరీ పనితనంతోడయితే చాలు నిండుగా చేతుల నిండా గాజులు చెవులకు పెద్ద జుంకాలు ,సల్వార్ హారాలు వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.

Leave a comment