ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన  ప్రయాణాలు చేసే వారైతే ఆబరంలు క్వచ్చిన్ లగేజ్ తోనే  ఉంచుకోవాలి . ఇక వేరే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సముద్ర తీరం వైపుగా వెళ్లాల్సి వస్తే ఇసుక రఫ్ టెక్చార్ వల్ల  విలువైన రాళ్లకు హాని జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మెటల్ పై  గీతలు పడుతుంటాయి. కాబట్టి బీచ్ లో ఆభరణాలు ధరించవద్దు. స్విమ్మింగ్ పూల్స్ లో నీళ్లు ఆభరణాలకు తగలనీయద్దు . వీటిలో ముత్యాలు వజ్రాలు బంగారు నగలు రకరకాల నగలను  ఒకే అరలోకాకుండా  విడివిడిగా భద్రపరిస్తే బావుంటుంది.

Leave a comment