ప్రయాణాల్లో ఆభరణాలు సేఫ్ కాదని చాలా మంది అన్ని వదిలేసి వెళుతూ ఉంటారు. కానీ ఏదైనా ప్రత్యేక సందార్భాలు, పెళ్ళిళ్లు అయితే ఆభరణాలు తప్పని సరిగా తీసుకుపోవాలి కదా. వాటి విషయంలో భద్రంగా ఉంచుకోవటమే కాదు ప్రయాణాల్లో పాడవకుండా చూసుకోవాలి. రాళ్లు ,వజ్రాలు జాగ్రత్తగా ఉండేలా అనేక అరలున్న ట్రావెల్ పౌచ్ వాడాలి. సాఫ్ట్జ్ టిష్యూ పేపర్ లో చుట్టి భద్రంగా హాండ్ బాగ్ లోనే పెట్టుకోని వెంట ఉంచుకోవాలి. విమాన ప్రయాణాల్లో క్యాబిన్ లగేజ్ లోనే ఉంచుకోవాలి. విలువైన రాళ్లు పాడవకుండా,మెటల్ పై గీతలు రాకుండా శ్రద్ధగా ప్యాక్ చేసుకుంటే ఆభరణాలు భద్రంగా ఉంటాయి.

Leave a comment