Categories
Gagana

ప్రేక్షకుల అభిమానం మరువలేను.

జై లవకుశ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశి ఖన్నా. కతెన్టర్ కావాలనుకుంటుందిట రాశి ఖన్నా. సినిమా యాక్టర్ అయిపోయింది. సంగీతం ఎంతో బాగా వచ్చు. రెండు సినిమాల్లో టైటిల్ సాంగ్ పాడింది. ‘తెలుగు ప్రేక్షకుల అభిమానంఎంతో గొప్పది. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారు. ఇది నేను ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్న మాటలివి అంటుంది రాశిఖన్నా. ఆమె పుట్టిన రోజు నాడు అభిమానులు కొంత మంది ఒక రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తామని ఆహ్వానించారట రాశిఖన్నా వెళ్ళగానే పై నుంచి పూల వర్షం, బయట టపాసుల మోతలు, చుట్టూ అభిమానుల చప్పట్లు, అభినందనల వర్షం కురిసాయట. ఇంత గొప్ప ట్రీట్ నా జీవితంలో నీకెవ్వరు ఇవ్వలేదంటుంది రాశి. మాతృ దినోత్సవం రోజు ఆమె ఓ కవిత రాసి దాన్ని వీడియోగా విడుదల చేస్తే లక్ష మంది అభిమానులు ఆ వీడియో ను నిమిషాల్లో చూసారట. ఇలా వుంటుంది అభిమానం అంటుంది రాశి.

Leave a comment