చక్కగా శారీరక వ్యాయామం చేసే వారికి సహజ ప్రసవం అయ్యే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి . వాకింగ్ వల్ల తుంటి కండరాల్లో సాగే గుణం పెరుగుతుంది . ఈ అంశమే సుఖంగా ప్రసవం అయ్యేందుకు దోహదం చేస్తుంది . ఒక మహిళ తాను గర్భం దాల్చేందుకు ముందుగా పిట్ నెస్ ను బట్టి తనెంత దూరం హాయిగా శ్రమ లేకుండా నడవగలరు అనే అంశాన్ని నిర్ణయించుకొని అంత మేరకు నడిస్తే బావుంటుంది . అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నడక వల్ల కాబోయే తల్లి బరువు అదుపులో ఉండటమే కాకుండా ఆ సమయంలో సాధారణంగా కనిపించే జెస్టే షనల్ డయాబెటిస్ ను కూడా నడక నివారించ గలదు . నడక వాల్ల వంట్లో ఆరోగ్యకరమైన ఎండర్ఫిన్లు ,సంతోషాన్ని కలగజేసే రసాయనాలు వెలువడి గర్భవతుల్లో ఒత్తిడిని తొలగించి వాళ్ళను హాయిగా సంతోషంగా ఉండేలా చేస్తాయి .

Leave a comment