రోహిత్ శెట్టి గోల్ మాల్ 4 లో నటించబోతున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇంకా రెండు సినిమాల చర్చలు నడుస్తున్నాయి. అక్క , వదినా, చెల్లి, ఇలా ఏ పాత్రలయినా నాకు నచ్చితే చేస్తాను. సినిమాలో నాదే మెయిన్ రోల్ కావాలని కోరికేమీ లేదు అంటుంది టబు. గ్రీకు వీరుడు, నారాకుమారుడు అంటూ నిన్నే  పెళ్లాడతా సినిమాలో దక్షినాదిన తిరుగులేని స్టార్ గా ముద్ర వేయించుకున్న  టబు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ప్రయాణిస్తూనే వుంది. నాకెరీర్ ప్రరంభం నుంచి నాకు మంచి పాత్రలే దొరికాయి. ఇందుకు నా స్వశక్తి ఒక్కటే కారణం కాదు. నా కో స్టార్స్  సపోర్ట్ ఎంతో వుంది. నెంబర్ వన్, నెంబర్ టూ అనేది తాత్కాలికం ప్రేక్షకుల హృదయంలో నా స్ధానం పదిలంగానే వుంటుంది టబు. చాలా సినిమాలు చేసాను కానీ నటిగా నాకు మంచి పేరు తెచ్చినవి దక్షిణాది సినిమాలే అంటుంది టబు.

Leave a comment