పింక్ తర్వాత తాప్సీ  తన సినిమాల సెలక్షన్ లో మార్పు తెచ్చింది. ఆమె కీలక పాత్రలో నటించిన కొత్త చిత్రం నెనే షబానా ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు ఆమె నటన ఇది ప్రత్యేకమైన సినిమా అని చెప్పకనే చెపుతోంది. తాప్సీ చెడుకు వ్యతరేకంగా పోరాటం చేసే పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015 లో విడుదలైన బాబీ కి ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. మర్చి 31 న నేనేషబానా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఇసినిమా గురించి తాప్సీ  పన్ను చాలా ఉత్సాహంగా వుంది. అయితే సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే అందం అభినయం చాలా అని అడిగితే మాత్రం పెద్ద స్టార్స్ లో తెరంగేట్రం చేయకపోతేనూ లేదా ఏదైనా నిర్మాణ సంస్థతో ఒప్పందాలు లేకపోతేనూ సినీరంగంలో నిలదొక్కుకోవడం కష్టంఅనేసింది. అయితే సినిమా సినిమాకు ప్రేక్షకులే తనను మెచ్చుకుని   గాడ్ ఫాథర్స్ అయ్యారని వాళ్లే  తన సక్సెస్ ను కారణమనీ చెప్తోంది తాప్సీ .

Leave a comment