శీతల పానీయాలతో కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకోవటమే అంటారు నిపుణులు రోజుకో కూల్ డ్రింక్ తాగితే మధుమేహం బారినపడే అవకాశాలు 67 శాతం ఉన్నాయి. సోడాల్లో ఉండే బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ అనే రసాయనానికి నాడీ నష్టానికి సంబంధం ఉంది. ఈ రసాయనం తో చర్మంపైన దద్దుర్లు వస్తాయి. కూల్ డ్రింక్స్ నిల్వ ఉండేందుకు వాడే ఫాస్పేట్స్ పాస్ఫారిక్ యాసిడ్ లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వార్ధక్యపు లక్షణాలు వస్తాయి. రోజుకో కూల్ డ్రింక్ తో రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. ఇవి గుండె రక్త నాళాలను గట్టిపరుస్తాయి. వీటిలోని ఫాస్ఫారిక్ యాసిడ్ లతో దంతక్షయం పెరుగుతుంది.

Leave a comment