మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అవి శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. మనకున్న చిరాకులు, విసుగులు మరచిపోవాలంటే డైలీ రొటీన్ జీవితం నుంచి కాస్త విముక్తి కావాలంటే ఉన్న పరిస్తితుల నుంచి కాస్త దూరంగా వెళ్ళాలి. మనసుకు ఒక ఉపశమనం కలుగుతుంది. ప్రయాణం కోసం ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. అద్భుతమైన సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన ప్రయాణాలే విహార యాత్రలు కావు. చిన్న పల్లెటూర్లో కాస్త మార్పుగా రెండు రోజులు గడిపినా చాలు అదీ గొప్ప అనుభవమే. ఏ వయసులో ఉన్నా ఈ ప్రయాణాలు ఆనందాన్నే ఇస్తాయి.

Leave a comment