ఒత్తిడి ఆందోళన ఈ ఆధునిక ప్రపంచంలో తొంభై శాతం మందిని వేధించే అనారోగ్యాలు. వీటికి వైద్యం మందులు కంటే థెరపీలు బాగా పనిచేస్తాయంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో వింత థెరపీలు కూడా ఉన్నాయి. ఇందులో ఎమ్టీ ఛెయిర్ థెరపీ ఒకటి. ఆఫీస్ లో బాస్ పైనో,అంతులేని కోపం వస్తుంది. ఏమీ అనలేక అంతులేని ఒత్తిడి పీడిస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జర్మనీ సైకో థెరపిస్ట్ ఫెడరిక్ సాలొమాన్ ఎమ్టీ ఛెయిర్ టెక్నిక్ కనిపెట్టాడు. ఇందులో ఎదురుగ ఒక ఖాళీ కుర్చీ ని ఉంచుకొని మనకి నచ్చని వ్యక్తిని ఆ కుర్చీలో ఊహించుకొని తిట్టాలనుకొన్నవన్నీ తిట్టేస్తే లేదా చెప్పాలనుకొన్నవన్నీ చెప్పేస్తే మనసు తేలిక పడి పోతుంది అంటారాయన ఎవ్వళ్ళ ముందు ముందు వెళ్ళడించ లేని ఎన్నో విషయాలను ఈ ఖాళీ కుర్చీకి చెప్పుకొంటే వత్తిడి మాయం అయిపోతుంది.

Leave a comment