Categories
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిందే . కొవ్వుని కరిగించేది . జీర్ణశక్తి ని పెంచేది . నోటి వ్యాధులకు మందుగా వెల్లుల్లి సుగుణాల గురించి విన్నాం . కానీ కొత్త అధ్యయనం వెల్లుల్లి వల్ల సమస్యలు ఉన్నాయంటోంది . ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకొంటే లివర్ పనితీరు దెబ్బ తింటుంది అంటున్నారు అధ్యయనకారులు . పాచి వెల్లుల్లిని తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ హెల్త్ దుష్ప్రభావం పడుతుంది . అంచేత దీన్ని మితంగా వాడాలి . పాచి వెల్లుల్లి కాకుండా దీన్ని వంటకంలో భాగంగా ఉపయోగించాలి . కూరగాయల తో కలిపి ఉడికిస్తేనే ఇందులో సుగుణాలు శరీరానికి చేరతాయి అంటున్నారు .