కరోనా మొదలయ్యాక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్ళే.ఇది ముందు బాగానే ఉన్నా నిద్ర అలవాట్లను ఎంతో ప్రభావితం చేస్తోంది అంటున్నారు పరిశోధకులు. ఒక సారిగా జీవనశైలిలో వచ్చిన మార్పు వల్ల నిద్ర పైన ప్రభావం పడుతోంది.18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ల పైన చేసిన అధ్యయనంలో క్వారంటైన్ కు ముందు, క్వారంటైన్ పూర్తయిన నలభై రోజుల తర్వాత నిద్ర అలవాటు ను పరిశీలించారు. క్వారంటైన్ తర్వాత నిద్రపోయే సమయం చాలా తగ్గటం పరిశీలనలో తేలింది.వర్క్ ఫ్రొం హోమ్ లో ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల ఈ సమస్య ప్రారంభమైందని తేలింది.సరైన వ్యాయామం, ఆరోగ్యం ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవటం వల్ల కూడా నిద్రలేమి పెరుగుతోంది. నిద్ర పట్టే సమయం వరకు ఈ స్మార్ట్ ఫోన్ చూడటం వల్లనే నష్టం జరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment