ప్రాపర్టీలు కోనుగోళ్ళు, అద్దెకు తీసుకోవడం విషయంలో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక తాజా అధ్యాయనం చెబుతుంది. మహిళలు ఆన్ లైన్లో వ్యవహరించే తీరు అధ్యాయనం చేసిన నేపథ్యంలో ఈ విషయం వెల్లడైంది.  2018 ఆన్ లైన్ సెషన్స్ లో మహిళా యూజర్ల వాట 51 శాతంగా పురుషుల వాటా 49 శాతంగా ఉంది. ఈ ఏడాదిలో మహిళల వాటా 54శాతంగా ఉంది. ప్రాపర్టీ అన్వేషణ విషయంలో మహిళా యూజర్ల వాటా క్రమంగా పెరుగుతుంది. ప్రాపర్టీల కొనుగోలు అద్దెకు తీసుకునే విషయంలో మహిళలే కీలకంగా ఉన్నారని ఈ ఆన్ లైన్ అధ్యాయనంలో తేలింది. మహిళలలో ఆర్ధిక స్వేచ్చ పెరగడంతోనే రియాల్టీ సంభందిత నిర్ణయాల్లో వారు చురుకుగా ఉన్నారని సర్వే చెబుతుంది.

Leave a comment