గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు అలసి పోతాయి.నయనాలను అలసట లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు, చేపలు తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు.జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, వేరుశెనగపప్పు ల్లో ఉండే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు సజ్జ అవిసె గింజల్లో ఉండే విటమిన్ -ఇ ఆకుకూరల్లో ఉండే ల్యుటిన్, గ్జియాంతిన్ , విటమన్‌-సి, కె, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యారెట్ లలో ఉండే విటమిన్-ఎ, బీటా కెరోటిన్ సాయంతో శరీరం, విటమిన్ఎ- ను తయారు చేసుకుంటుంది. క్యారెట్లు ప్రతిరోజు తినటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

Leave a comment