Categories
బాగా ముదురు రంగులో మెరుస్తున్నట్లు కనిపించే పండ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . అచ్ఛం రక్త నాళాలతో కనిపించే ద్రాక్షాగుత్తి హృదయాకారంలో ఉంటుంది . ద్రాక్ష గింజలు కూడా హైకొలెస్టాల్ తగ్గించి రక్తపోటు ను అదుపులో ఉంచుతాయి . కివి పండ్లలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ చెర్రీ పండులో దొరికే విటమిన్ బి ,ఫోలేట్ ఫైబర్ టొమేటో లో నిండివున్న లైకోపీన్ పోషకం గుండెకు అద్భుతమైన శక్తి ని ఇస్తాయి . మెరిసే ఎర్రని రంగులు ఉండే యాపిల్ ,యప్రికాట్ అరటి కారభూజా,నారింజ పండ్లు ఇవన్నీ గుండెకు మేలు చేసే పండ్లు . ముఖ్యంగా అరటి పండులో ఉండే పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి .