అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో తిరిగేందుకు భయపడే తరుణంలో నేను తోడుగా వున్నానంటూ సెలబ్రెటీస్ . బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపిందించిన లూప్ ఫాలో అయితే మాములు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యులౌతారు. ఇందులో సభ్యులైతే తప్పకుండా మంచి వింటున్నారు నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకో యాప్ వుంది . పేరు సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్. అకస్మాత్తుగా ఎవరైనా దాడి చేస్తే చటుక్కున ఎలా ఎదుర్కోవాలో ఎలా కదలాలో  చేతులు కాళ్ళని ఆయుధాలుగా ఎలా వాడాలో నేర్పిస్తుందీ యాప్ . చేతి వేళ్ళు తేలికపాటి కర్రలు ఇనుప వస్తువులు ఆత్మ రక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో  నేర్పుతుంది యాప్. ఏ పంచ్ ఎక్కడ వాడాలో నేర్పించే యాప్ లున్నాయి . అమ్మాయిలు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు ఎప్పటికీ వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే.

 

Leave a comment