విహార యాత్ర ల కోసం ఏ దేశానికి వెళ్ళినా అక్కడ చక్కని హోటళ్ళు లగ్జరీ కార్లు అద్దెకు దొరుకుతాయి . కానీ హవాయి ద్వీపంలో ఈ హోటళ్ళు ,కార్లతో పటు సరదాగా మనతో పటు తిరిగేందుకు పెంపుడు జంతువులను అద్దెకు ఇస్తారు . పర్యాటకులను ఆకర్షించేందుకు ఇదో కొత్తరకం ప్లాన్ . హవాయి లోని కువాయి ద్వీపానికి వచ్చి పర్యాటకులు పిల్లలు ,కుక్కలకు దత్తత తీసుకోవచ్చు . కువై హ్యూమన్ సొసైటీ వాళ్ళు సముద్ర తీరాల్లో సరదాగా తిరిగేందుకు పెంపుడు జంతువులను స్నేహితులుగా ఇస్తారు . రోజంతా వాటితో సరదాగా గడపాక వాటిని ఇష్టపడితే శాశ్వతంగా దత్తత తీసుకోవచ్చు కూడా . హ్యూమన్ సొసైటీ ఆద్వర్యం లోనే నడుస్తున్న యానిమల్ షెల్టర్ బోలెడన్ని కుక్కలు ,పిల్లులు ఉన్నాయి . వాటికీ మంచి యజమాని దొరకాలని కోరికతో ఇలా ఓ పూట అద్దెకు ఇస్తూ ఉంటారు .

Leave a comment