ఇంట్లో భార్యా భర్తా ఇద్దరూ సంపాదిస్తూ వుంటే ఆ కుటుంబం చల్లగా, చక్కగా, సజావుగా సాగుతూ ఉంటుందని చాలా కాలంగా అందరం అనుకుంటున్నాం ఇప్పుడొక తాజా రిపోర్టు మాత్రం సంపాదించే భార్య పైన ఆధారపడి జీవిస్తున్న భర్తలు ఏ మాత్రం సంతోషంగా వుండడని , వాళ్ళు తీవ్రమైన వత్తిడి తో హుద్రోగం, మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని అమెరికాలోని ఒక అద్యాయిన కేంద్రం రిపోర్టు సాధారణంగా పురుషులు కుటుంబానికి తామే ఆధారంగా నిలవాలనీ, స్త్రీలు తమపై ఆధార పడాలని కోరుకుంటారనీ ఒక వేళ పరిస్ధితి తలకిందులైతే మాత్రం వారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యి అనారోగ్యం పాలవ్వక తప్పదని చెప్పుతుంది. ఈ రిపోర్టు ను బట్టి పురుషుల దృక్పదం లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని అర్ధం చేసుకోవచ్చు.

Leave a comment