గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోతూ కుడా ఔనత్యాన్ని చాటుకుంది. ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ పర్వీన్ బాబీ సుహాగ్ ,దీవార్ ,కాలా సోనా, షాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. 1970 నుంచి 80 దాకా ఆమె బాలీవుడ్ ఫస్ట్ వుమెన్ సూపర్ స్టార్ గానే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అమితాబ్ తో అయితే వరసగా 8 సినిమాల్లో నటించింది. వాళ్లిద్దరూ హిట్ పెయిర్ అనేవాళ్ళు. కానీ హఠాత్తుగా సినిమాల్లో నుంచి మాయమైన పర్వీన్ చివరి రోజులు చాలా దారుణం.ఆమె చనిపోయిన మూడు రోజుల వరకు ప్రపంచానికి తెలియదు. షుగర్ తో ఒక చెయ్యి గాంగ్రీన్ వచ్చి పూర్తిగా పడిపోయిన స్థితిలో కనీసం లేచి నడవలేని స్థితిలో ఆమె మరణించి ఉంది. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ హాస్పటల్ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఒక్క మెతుకు ఆహరం లేదు. ఎన్నో కోట్లు ఆస్తి వదిలిపోయిన ఆమె జీవితంలో చివరి మూడు రోజులు ఆకలితో తపించి చనిపోయిందని తలుచుకుంటేనే బాధగా వుంటోంది. ఒకనాటి సూపర్ స్టార్ అందాల తార జీవితం ఇది.
Categories
Nemalika

పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

Leave a comment