పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలు మేధావులు మాత్రమే ఆలోచించవలసింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంట జరగవలసిన పవిత్ర కార్యక్రమం అంటోంది ప్రముఖ నటి దియా మీర్జా ఇప్పటి వరకు పర్యావరణానికి చేసిన హాని చాలు ఇకనైనా సహజ వనరులను కాపాడుకుందాం అనే దియా ఐక్యరాజ్య సమితి తరపున ఎన్నో పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండుసార్లు ఐరాస  పర్యావరణ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన దియా. సముద్రాల్లో వ్యర్ధాలపై చైతన్యం కోసం ముంబై లోని బీచ్ క్లీనింగ్ డ్రైవ్ లను నిర్వహిస్తోంది. పర్యావరణహిత ప్యాషన్ బ్రాండ్ లకు మాత్రమే మోడల్ గా వ్యవహరిస్తోంది.

Leave a comment