ఐస్ ముక్క తో ముఖం మసాజ్ చేస్తూ ఉంటాను. మొటిమలు నల్ల మచ్చలు రాకపోవటానికి బహుశా ఇదే కారణం అంటుంది శ్రద్ధాకపూర్.ఒక ఈమెయిల్ ఇంటర్వ్యూ లో తన సౌందర్య రహస్యాలను వివరించింది శ్రద్ధాకపూర్. ఎక్కువ సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించాను.చర్మం మెరుస్తూ ఉండేందుకు విటమిన్లు ఎంతో అవసరం ఆహారం ద్వారానే విటమిన్లు అందేలా చూసుకుంటాను. మేకప్ విషయానికి వస్తే మాయిశ్చరైజర్ నా బెస్ట్ ఫ్రెండ్.కాటుక కొద్దిగా కన్ సిలర్ టిన్టెడ్ లిప్ బామ్ ఇష్టపడతాను. ఇక జుట్టు గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు నా వేగాన్  డైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు చాలు అన్నదే నా బ్యూటీ సీక్రెట్ అంటుంది శ్రద్ధాకపూర్.

Leave a comment