సౌందర్యం కోసం ఉపయోగించే ఎన్నో క్రీములు లోషన్ల కంటే వేపాకులు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి అంటారు ఆయుర్వేద వైద్యులు.  వేపాకులు వేసి మరిగించిన నీళ్లతో మొహం కడుక్కుంటే కళ్ళు తేటగా ఉంటాయి. ముఖంలో నిగారింపు వస్తుంది. కళ్ళు మంటలు ఎర్రబడటం ఉండదు. ప్రతి ఉదయం రెండు వేపాకులు తింటే, లేదా ముద్దగా నూరి తిన్న చర్మం కాంతివంతంగా ఉంటుంది. మొటిమలు కళ్ళకింద వలయాలు తగ్గుతాయి. వేపాకు నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలడం చిట్లటం డ్రై గా అవటం చుండ్రు వంటి సమస్యలు తగ్గి కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. రెండే రెండు వేప ఆకులతో అందం ఆరోగ్యం సొంతం అవుతాయి.

Leave a comment