నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక  ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి  చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె పేరు మోగిపోయింది. విద్య అవసరం ఉన్న మహిళలలకు సాయం చేయటంలో ముందుండే విద్యకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది. జనవరి 1 న పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యా బాలన్ కు శుభాకాంక్షలు చెప్పేసి 2017 లో ఇంకెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.

Leave a comment