వేసవి ఎండలు మాడ్చేస్తుంటే శరీరం చల్లదనంతో ఉండాలని కోరుకొంటుంది. వీలైతే వస్త్ర ధారణలో పువ్వులకు ప్రాధాన్యత ఇచ్చి చూడండి అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పులరంగు టాప్ లు, పైజామాలు, పలజోలు ఏవైనా సరే చెక్కని పూల ప్రింట్ల టాప్లు వేసుకుని అడుగున వదులుగా ఎలాంటి  డిజైన్లు లేకుండా సాదా ప్యాంట్లో స్కర్టులు  వేసుకోవచ్చు. లేదా పూల ప్రింట్ల కుర్తీలకు చెక్కని జీన్స్ జత చేస్తే చాలు, ఈ వేసవిలో ట్రెండో లుక్ వచ్చేస్తుంది. చక్కని పూల స్కార్ఫులు, దుపట్టా వుంటే అటు టాప్ ల పైకి, ఇటు కుర్తిలకు సరిపోతాయి. లేదా మేడలో వేసుకునే హారాలు, హెయిర్ క్లిప్స్, బ్యాగులు, బ్రేస్ లెట్స్, టోపీలు, చెప్పులు పూల డిజైన్ లో ఎంపిక చేసుకుని చూడండి. ఏదైనా పార్టీలుంటే పూల ప్రింట్ల మాక్సీలు, గౌన్లు, పూల ప్రింట్ తో వున్న జార్జట్ చీరలు కట్టుకున్నా సరే. ఆన్ లైన్ సమ్మర్ ఫ్యాషన్ లుక్ సొంతమవుతుంది. అసలా ఫీలింగ్ తప్పకుండా వస్తుంది.

Leave a comment