మొహం అందంగా మెరిసిపోయేందుకు  ఇంట్లో వుండే వస్తువులు  సరిగ్గా ఉపయోగిస్తే చాలు. నిద్ర లేక కళ్ళు బరువుగా వుంటే లేదా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు కనిపిస్తే ఈ టిప్ ట్రయ్ చేయచ్చు. గ్రీన్ టీ బాగ్స్ ను తడిపి ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్స్ కళ్ళ పైన వుంచుకుంటే అలసట పోయి, కళ్ళ కింద వలయాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే పెరుగులా కనిపించే యోగర్ట్  ల్లో పంచదార కలిపి దీన్ని ముఖానికి మాస్కుల్లా వేసుకుని కాసేపు అయ్యాక చల్లని నీళ్ళతో కడిగేస్తే ముఖం ఫ్రేష్ గా అయిపోతుంది. ఎండ కారణంగా ముఖం కండి పొతే నాణ్యమైన ఎఫ్.సి.ఎఫ్ ను ప్రతి రెండు గంటలకు రాసుకుంటూ వుంటే ముఖం మాములుగా అయిపోతుంది. వేడి నీరు కుడా మొహాన్ని పోదిబారేలా చేస్తుంది. చల్లని నీటి స్నానం మేలు లేదా మరీ అలవాటు లేదంటే గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచిది.

Leave a comment