రోజు యూనిఫామ్ తప్పదు కానీ వారంలో ఒక రోజు మాత్రం పిల్లలకు త్తమకు నచ్చిన డ్రెస్ వేసుకునే అవకాశం వుంటుంది స్కూళ్ళలో. పిల్లలకు ఎన్నో రకాల జోళ్ళు ఎన్నో వెరైటీలు మార్కెట్లో వున్నాయి. అలాగే ఫ్యాషన్ గా వుండే బ్యాగులు కూడా మిక్కి మౌస్, దోనల్డ్, బార్బీ బొమ్మల తో వుండే బాగ్స్ పిల్లలు ఎంతో ఇష్టపడుతున్నారు. పిల్లలకోసం వచ్చే యాక్స సారీస్ కు కూడా కొదవ లేదు. పువ్వులు, సీతాకోక చిలుకలుతో రూపొందించిన హెయిర్ గ్రిప్స్, హెయిర్ రబ్బర్ బాండ్స్, క్లాత్ తో తయ్యారు చేసిన హెయిర్ క్లిప్స్ పాపైలకు ఎంతో బావుంటాయి. చేతులకు రంగు రంగుల బ్రాస్ లెట్స్ కూడా. ఇవన్నీ ఎంతో ఖరీదైనవి కాదు. పిల్లల కళ్ళకు ఆకర్షనీయంగా కనబడేవి. వాళ్ళు ఎగిరే తునీగల్లాగ, నవ్వే పువ్వుల్లాగా, ఆకాశంలో హరివిల్లు లాగా కనిపించాలంటే ఇల్లాంటి యాక్సెసరీస్ తోనే అందం అంతా. పిల్లల స్టయిల్ కు తగ్గ అలంకరణ వస్తువుల కోసం నెట్ లో వెతకొచ్చు.

Leave a comment