వజ్రాలు నగలు కొనే సమయంలో వాటి నాణ్యత గురించిన అవగాహణ ఉంటే మంచి వజ్రాలు ఎంచుకోవచ్చు. భూగర్భంలో తయారయ్యే వజ్రాలు శుద్ధి చేసిన వాటిలో ఎంతో కొంత ఇంప్యూరిటీలు ఉండిపోతాయి, మెరుపులో కొరత ఏమి ఉండదు. వెరి వెరీ స్కాల్ ఇంక్లూజన్ వజ్రం లో కంటికి కనబడనంత సూక్ష్మమైన నలక వుంటుంది. ఇవి ఖరీదెక్కువ ఒక క్యారట్ వజ్రం 46 వేల నుంచి 48 వేల వరకు వుంటుంది. వెరీ స్కాల్ ఇంక్లూజన్ వజ్రంలో చిన్న మరక వుంటుంది. ఈ రకం వజ్రాలు 38 వేల నుంచి 42 వెల వరకు ఉంటాయి. ఎస్.ఐ రకం లో వజ్రంలో మరక పరీక్షిస్తే కనిపిస్తుంది. వీటి ధర క్యారట్ 28 వేల నుంచి 35 వెల వరకు ఉంటుంది. హెచ్ .ఐ అంటే హైలీ ఇంక్లూడెడ్ రకం వజ్రం వీటి కొనుగోళ్ళు ఎక్కువగా వుంటాయి.ధర క్యారట్ 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎలాటి వజ్రాలన్నీ రిటర్న్ వాల్యూ నూటికి నూరు శాతం ఉంటుంది.

Leave a comment