హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ తో శ్రద్దా కపూర్ పోస్టర్ అచ్చమైన లేడీ డాన్ లాగే వుందని మంచి ప్రశంసలు దక్కుతాయి . అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్. దావూద్ లాగే ముంబై లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది హసీనా పార్కర్. ఇప్పుడామె జీవితం హసీనా పేరుతో వెండి తెరకు ఎక్కుతుంది. హసీనా కు 17 సంవత్సరాల వయసు నుంచి 43 ఏళ్ల వయసు వరకు క్వీన్ ఆఫ్ ముంబాయి గా ఎదిగిన క్రమం ఈ చిత్రంలో చూపెడుతున్నారు. ఇందులో దావుద్ పాత్రలో శ్రద్ధ కపూర్ సోదరుడు సిద్దార్ధ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం జులై 14 న విడుదలవుతోంది . ఇంతవరకు ఎన్నో చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించిన శ్రద్దా ఈ చిత్రంలో డీ గ్లామర్ గా కనిపిస్తోంది.
Categories