మిస్ ఇండియా టైటిల్ గెలవటం లక్ష్యం గూగుల్, యూట్యూబ్ ల్లో చూసి అందాల పోటీ లకు కావలసిన అర్హతలను సొంతంగా సాధించుకున్న. ఆత్మవిశ్వాసంతో కిరీటం సాధించుకున్న అంటుంది దీప్తి శ్రీరంగం ఎలాంటి శిక్షణ లేకుండా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం లో పుట్టి దీప్తి హైదరాబాద్ టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. మోడల్, గాయిని, రేడియో జాకీ, ఎం.బి.ఎ  మొదటి సంవత్సరం విద్యార్థిని కూడా ‘ ఐశ్వర్య రాయ్ నాకు స్ఫూర్తి ఆమె లాగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ వేదికపై పోటీపడాలన్నది నా కల అంటుంది దీప్తి శ్రీరంగం.

Leave a comment