రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ కూడా శరీరానికి అందుతుంది.రాగుల్లో ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఈ రాగుల్ని జావలాగా కానీ దోసెల్లో కానీ ఏ రూపంలో తీసుకొన్నా ప్రయోజనకరమే!

Leave a comment