సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా తినటాన్ని అరికతట్టగలుగుతాయి. ఫలితంగా బరువు తగ్గిపోతారు. మానోపాజ్ దశ లో వున్న మహిళల్లో కొద్దిపాటి ఎండుద్రాక్ష తిన్న కాల్షియం లభించి ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో రక్తాన్ని సుద్ధి చేసే గుణాలు వున్నాయి కనుక చర్మ కాంతి ఎక్కువై వృద్దాప్యభయాలు దగ్గరికి రావు. ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఓ టీస్పూన్ నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలు.

Leave a comment