కరోనా సమయం జీవిత విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని, రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని మరీ తింటున్నారు. ఆ పరంపరలో కి ఇంద్ర ధనస్సు డైట్ వచ్చి చేరింది. భోజనంలో అన్ని రంగుల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవటం ఇవ్వాల్సిన అవసరం. ముఖ్యంగా ఏడు రంగుల్లో ఉన్న పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అపారం. చిలకడ దుంప, స్వీట్ కార్న్, ఆప్రికాట్, క్యారెట్లు, ఎర్ర గుమ్మడి కాయలు కషాయం రంగు కిందికే వస్తాయి. ఈ రంగు పదార్థాల్లో ల్యుటెన్ ఉంటుంది. టమోటా, చెర్రీలు, ఆపిల్, దానిమ్మ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బొప్పాయి, ద్రాక్ష, పుచ్చకాయ ఎరుపురంగు కిందికే వస్తాయి. ఈ రంగులో లైకోపిన్ అధికం ఆకుపచ్చ రంగు బఠాణీలు, ఆకుకూరలు, బ్రోకలీ, క్యాబేజీ, మొలకెత్తిన గింజల్లో బోర్వెల్ ట్యూమర్లను అరికట్టే శక్తి ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి నేరేడు ఎండుద్రాక్ష మొదలైన నీలం రంగులు ఉండే పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. పసుపు రంగులో ఉండే పైనా ఆపిల్, అరటి, నిమ్మ వంటివి కండరాలకు మేలుచేస్తాయి. వంగపండు రంగులో ఉండే బ్లాక్ బెర్రీ,ద్రాక్ష మొదలైన వాటిలో క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి మెండుగా ఉంటుంది. తెల్లగా ఉండే ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి మొదలైనవి ఫంగస్ ఇన్ఫెక్షన్ లను దగ్గరకు రానివ్వవు. ఈ రెయిన్ బో డైట్ ఫాలో అయితే శరీరానికి పోషకాలు అందుతాయి.

Leave a comment