ఒక్కసారి వర్షం వదలకుండా పడతు ఉంటుంది. ఇల్లంతా తడిగా ఉంటుంది కాళ్ళు నీళ్ళ లో అస్తమానం తడుస్తూ కాలిగోళ్ళ ఫంగస్ వచ్చేస్తుంది. చెప్పులు లేకుండా పాదాలు నెలకు ఆన్చి తడి లోనే నడవటం, సాక్స్,చెప్పులు పరిశ్రుభంగా లేక పోవటం,లేదా అవి వానలో నాని చల్లగా ఉండటం వళ్ళ కాలి వేళ్ళకు ఫంగస్ వస్తుంది. పాదాలు పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. టబ్ లో నీళ్ళు పోసి నాలుగు స్పూన్ లు బేకింగ్ సోడా ఒక కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ వేసి పాదాలు మునిగేలా కాసేపు ఉంచాలి. తర్వాత మెత్తని టవల్ తో తుడిచి ఏదైనా ఆయింట్ మెంట్ అప్లయ్ చేసి ఫంగస్ కు కారణం ఆయే బాక్టీరియా నాశనం అవుతుంది. ఆయిట్ మెంట్ డాక్టర్ సలహా తోనే ఎంచుకోవాలి.

Leave a comment